గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్స్ తొలగింపు
గూగుల్ తన ప్లేస్టోర్ లోని 85 యాప్‌లను తొలగించింది. భద్రతా కారణాల రిత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. తొలగించిన యాప్‌లలో ఎక్కువగా ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని, వీటిలో సూపర్‌సెల్ఫీ, కాస్ కెమెరా, వన్ స్ట్రోక్ లైన్ పజిల్ లాంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయని గూగుల్ పేర్కొంది. యాడ్వేర్ అనే మాల్వేర్ రకం వైరస్ ఈ యాప్‌లలో ఉందంటూ ట్రెండ్ మైక్రో అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించడంతో గూగుల్ వాటిని తొలగించింది. ఇవి అననుకూల యాడ్లను చూపించడమేగాక, వినియోగదారుల సమాచారాన్ని వినియోగించుకుంటున్నాయని గూగుల్ తెలిపింది. అయితే ఈ యాడ్వేర్ పాత ఆండ్రాయడ్ ఫోన్లను ఏం చేయదని గూగుల్ పేర్కొంది.