క్లాస్ డ్రెసింగ్ లో మాస్ హీరో

2015 చివర్లో సౌఖ్యం మూవీతో నిరుత్సాహకరమైన ఫలితాన్ని చవిచూసిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒకవైపు జ్యోతికృష్ణ డైరెక్షన్ లో ఆక్సిజన్ మూవీని కంప్లీట్ చేస్తూనే.. మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద చిత్రాన్ని కూడా పూర్తి చేసేస్తున్నాడు.

గౌతమ్ నందకు ప్రస్తుతం టాకీ పార్ట్ షూట్ ఫినిష్ కాగా.. త్వరలో మరో రెండు పాటల షూటింగ్ కోసం.. యూనిట్ అంతా దుబాయ్ వెళ్లనున్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఇక్కడే తెరకెక్కించనున్నారట. మరోవైపు ఈ మూవీ సినిమాకి పబ్లిసిటీ యాక్టివిటీస్ ని కూడా నడిపేస్తున్నారు. కొత్త కొత్త లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్ జీన్స్ పై సూట్  వేసుకున్న హీరో గోపీచంద్ లుక్ ని రిలీజ్ చేయగా.. ఇది సూపర్ గా ఉందనే టాక్ వచ్చింది. గోపీ చంద్ మాస్ హీరో కాగా.. క్లాస్ టచ్ తో మాస్ లుక్స్ ఉన్న ఈ  పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

హన్సిక మొత్వాని.. కేథరిన్ థ్రెసాలు గౌతమ్ నంద మూవీలో హీరోయిన్లుగా నటించగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జె. భగవాన్.. జె పుల్లారావులు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా..  భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *