గ్రీన్ ల్యాండ్ లో కరుగుతున్న మంచు

ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏదంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది గ్రీన్ ల్యాండ్. ఈ ద్వీపం భూభాగం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. దాదాపు మొత్తం భూభాగంలో 90 శాతం మంచుతో కప్పబడి ఉండే ఈ ఐస్ ల్యాండ్ ఇప్పుడు తన ప్రకృతిక అందాల్ని కోల్పోతుంది. దానికి కారణం అక్కడ ఉన్న మంచు అతి వేగంగా కరగటమే. దీనితో అక్కడి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నిరంతా అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తోంది. సుమారు 12 బిలియన్ టన్నుల మంచు కేవలం 24 గంటల్లో కరిగిపోయిందట.green land

భూమిపై పెరిగిపోతున్న వేడిమికి అంటార్కిటికా ఖండంలోని మంచు గడ్డలు క్రమంగా కరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముప్పు గ్రీన్‌లాండ్‌ను కూడా తాకింది. గతవారం రోజులుగా మంచు కరగడం ఎక్కువైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 31న అతి ఎక్కువ మంచు కరిగిందని, 2012 నాటి నుంచి ఇదే ఎక్కువని తెలిపారు. ఒక్క జూలైలోనే 197 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయి అట్లాంటిక్ సముద్రంలో కలిసిందని వాతావరణ పరిశోధకులు రుత్ మొట్రామ్ తెలిపారు. దీంతో సముద్ర మట్టం 0.1 మిల్లీ మీటర్, 0.02 ఇంచులకు పెరిగిందని వారు తెలిపారు. భూతాపం పెరిగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *