‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్ వదిలిన వర్మ…పూర్తి నగ్నంగా చూపించేశాడు

యుట్యూబ్ పుణ్యమా అంటూ అసలు సెన్సార్ గోల లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఏ బూతులు అయినా పెట్టేయొచ్చు.. ఎటువంటి చెత్త సీన్లు అయినా తీసేయొచ్చు. ముందు ప్రొడక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఎవరైనా కంప్లయింట్ ఇస్తే అప్పుడు సదరు వీడియోపై యంత్రాంగాలు రియాక్ట్ అవుతాయి. ఈ లాజిక్ ను ఇప్పుడు బాగా వాడేసుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఆల్రెడీ మనోడు సంచలనాలకు కేంద్ర బింధువు కాబట్టి.. ఇప్పటివరకు తాను వెండితెరపై తీయలేకపోతున్నాను అని చెబుతూ.. ఒరిజినల్ ముంబాయ్ మాఫియా కథ అంటూ.. ”గన్స్ అండ్ థైస్” అని ఒక వెబ్ సిరీస్ తీశౄడు వర్మ. ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. జనాలను చంపడం.. చిన్నపిల్లల ముఖాల మీద రక్తం చిమ్మేలా చేయడం వర్మకు కొత్త కాదులే.. కాకపోతే ఈసారి తన ఫేవరేట్ గ్లామర్ విషయం శృతి మించశాడు. ఒక గ్యాంగస్టర్ తో పడకలో ఉన్న ఒక అమ్మాయిని ఏకంగా పూర్తి నగ్నంగా ముందునుండే చూపించేశాడు వర్మ. ఇక బూతులు విషయానికొస్తే.. హిందీలో ఎన్ని చెత్త పదాలు ఉన్నాయో అన్నీ వాడించేశాడు. మొత్తంగా బూతు పురాణం ప్లస్ బ్లూ ఫిలిం కలిపి తీసినట్లున్నాడు వర్మ.

ఇక కత విషయానికొస్తే.. మనోడు ఎప్పుడూ తీసే ఆ ‘సత్య’ సినిమానే అటు మార్చి ఇటు మార్చి మళ్ళీ తీసేశాడు. ఈ విషయం సిరీస్ ట్రైలర్ మొదటి నిమిషంలోనే పసిగట్టేయొచ్చు. ఒకపోతే పూర్తి స్థాయి న్యూడ్ ను యుట్యూబ్ ఎంకరేజ్ చేయదు. మరి ఈ ట్రైలర్ ఎన్ని రోజులు ఆన్ లైన్లో ఉంటుందో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *