కసి మీదున్న గురు..!

‘బాబు బంగారం’ సినిమా తరువాత వెంకటేష్‌, సుధాకొంకర దర్శకత్వంలో ‘సాలా కడ్డూస్‌’ రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. సాలా కడ్డూస్ లోమాధవన్ అదరగొడితే.. ఇక్కడ వెంకీ చితక్కొట్టాడు. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాపై అంచ‌నాలు పెంచ‌డానికి ఈ సినిమా ట్రైల‌ర్‌ను ని విడుదల చేసారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు సినీ ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

స్లమ్ నుండి వచ్చిన ఒకమ్మాయిని బాక్సింగ్ ఛాంపియన్ చేయాలనే ఉద్దేశ్యంతో కోచ్ వెంకీ మాంచి కసిమీద రంగంలోకి దిగుతాడు. అయితే ఆ అమ్మాయి మాట వినదు. ఆ తరువాత జరిగిన కథ ఏంటనేదే సినిమా. గురువు శిష్యురాలిగా నటించిన రీతికా సింగ్ బాగా కనిపించింది ట్రైలర్‌లో.

ఇక ఊర కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని దృష్టంతా ఎప్పుడూ పెంట మీదనే ఉంటుంది’ వంటి ఏ స్టార్ చెప్పటానికి ఇష్టపడిని డైలాగులతో వెంకటేష్ చెప్పేశాడు.అలాంటి సింపుల్ అండ్ రియల్ లైఫ్ డైలాగులు ఈ సినిమాలో కోకల్లలు అనే చెప్పాలి. మొత్తంగా తన లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో వెంకీ మ్యాజిక్ చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *