ఏప్రిల్ 3 నుంచి కొత్త హెచ్1బీ దరఖాస్తులు

హెచ్1బీ వీసాపై ఇటీవలి కాలంలో నెలకొన్న ఉత్కంఠకు ఒకింత తెరపడింది. వలస వచ్చే నిపుణులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన ఈ వీసాలకు కత్తెర పడనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా తీపి కబురు అందించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో తేదీ నుంచి హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు స్వీకరిస్తామని అమెరికా తెలిపింది. దీని ప్రకారం నిపుణులైన మానవ వనరులను అమెరికాకు ఆహ్వానిస్తామని వెల్లడించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించింది. అర్హులకు తప్పనిసరిగా హెచ్1బీ వీసా మంజూరి అవుతుందని తెలిపింది.

ఇదిలా ఉండగా సమగ్ర వలస విధాన సంస్కరణలపై కసరత్తు జరుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా సర్కార్.. ఆ వివరాలు మాత్రం తెలుపలేదు. వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి శాన్ స్పైసర్ మీడియాతో మాట్లాడుతూ వలసల విధానంలో సమగ్ర సంస్కరణలు రాబోతున్నాయని ప్రకటించారు. “చట్టబద్ధ – చట్టవిరుద్ధ వలసలన్నిటిని పరిశీలిస్తున్నాం.. వ్యవస్థలోని హెచ్1బీ – కే-1 వీసాలు అన్నిటిని నూతన సంస్కరణల ద్వారా  సమీక్షిస్తున్నాం. వ్యవస్థను లోతుగా పరిశీలించిన తర్వాత ఏదైనా చెప్పగలం” అని ఆయన వెల్లడించారు.

అయితే భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్1బీ వీసా విధానంలో మార్పులు జరుగుతాయని సందేహాలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా…ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అమెరికాకు మేలు చేసే నిర్ణయాలనే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన అమెరికాకు నష్టదాయకమైన వాటి విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో అర్హులకు సమర్థులకు న్యాయం చేయడమే అమెరికా ప్రభుత్వ విధానామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *