ఒక రోజు.. రెండు హ్యాట్రిక్‌లు
ఐపీఎల్లో ఒక రోజు ఒక హ్యాట్రిక్ తీయడమే అరుదు. అలాంటిది శుక్రవారం ఒక్క రోజే రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఒక హ్యాట్రిక్ స్పిన్నర్ తీస్తే.. మరొకటి పేసర్ తీశాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు లెగ్‌స్పిన్నర్ శామ్యూల్ బద్రి హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఒక మెయిడెన్ కూడా వేశాడు. మరోవైపు రైజింగ్ పుణెతో మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అతను హ్యాట్రిక్ చేశాడు. టైకు కెరీర్లో ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం మరో విశేషం.