హలో షాకింగ్ కలెక్షన్ రిపోర్ట్

అక్కినేని అఖిల్ హలో మూవీ ఫస్ట్ రిపోర్ట్స్ చూసి కుర్రాడు గట్టి హిట్టే కొట్టాడు అనుకున్నారు అందరు. పైగా రివ్యూస్ చాలా పాజిటివ్ గా రావడం కూడా వర్క్ అవుట్ అయ్యేలాగే అనిపించింది . కాని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. ఇప్పటికే రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న హలో చేతిలో కేవలం ఐదు రోజుల టైం మాత్రమే ఉంది. అజ్ఞాతవాసి వచ్చాక ఎవరిని ఉండనివ్వడు. దానికి తోడు సంక్రాంతి హడావిడి స్టార్ట్ అవుతుంది కాబట్టి హలో దాదాపు ఖాళీ కావడం ఖాయం.

33 కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ అమ్మిన అన్నపూర్ణ సంస్థ ఇప్పటి దాకా డిస్ట్రిబ్యూటర్ షేర్ రూపంలో 17 కోట్లే రావడం షాక్ కి గురి చేస్తోంది. పెట్టుబడిలో కేవలం సగమే రావడం చూస్తుంటే భారీ నష్టాలు తప్పేలా లేవు. ఐదు రోజుల్లో అద్భుతాలు జరగవు కాబట్టి మహా అంటే కోటిన్నర వచ్చినా గొప్పే అనుకోవాలి. రెవిన్యూ ప్రకారం చూసుకుంటే హలో యావరేజ్ కూడా అనలేం.

నైజాంలో 5 కోట్లు , సీడెడ్ లో 2 కోట్లు, ఉత్తరాంధ్రాలో 1.4 కోట్లు, గుంటూర్ లో 1.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 69 లక్షలు, వెస్ట్ లో 61 లక్షలు, కృష్ణాలో 95 లక్షలు, నెల్లూరులో 50 లక్షలు, మొత్తంగా తెలుగు రాష్ట్రాలు కలిపి 12.5 కోట్ల దాకా హలో షేర్ తెచ్చింది. ఇక ఓవర్సీస్ లో 3.4 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియాలో 1.5 కోట్లు షేర్ రాబట్టిన హలో ఫైనల్ గా 17 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయింది.

ఈ లెక్కన కొన్నవాళ్ళకు నష్టం తప్పదని కన్ఫర్మ్ అయ్యింది. వింతగా నెగటివ్ టాక్  వచ్చిన నాని ఎంసిఎ సేఫ్ జోన్ లోకి వెళ్ళడమే కాదు చాలా చోట్ల లాభాలు కూడా ఇచ్చింది. ఫస్ట్ మూవీ తో దెబ్బ తిని రెండేళ్ళు గ్యాప్ తీసుకుని మరీ చేసినా హలో ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం పట్ల అక్కినేని ఫాన్స్ బాగా డిస్టర్బ్ లో ఉన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *