ప్రమాదం నుండి సీట్ బెల్టు కాపాడింది: రాజ్ తరుణ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పినా విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది.  కారు రోడ్డు పక్కన ఉన్న ప్రహారీ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజ్‌ తరుణ్‌ ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మొదటి ట్వీట్‌ చేశారు. సీటు బెల్టు తనను కాపాడిందని ఓ పోస్ట్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ‘నాపై చూపిన అభిమానానికి అందరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నానా, లేదా? అని తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేశారు. గత 3 నెలలుగా నేను ఇంటి నుంచి నార్సింగ్‌ సర్కిల్‌ మీదుగా ప్రయాణిస్తున్నాను. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడే సడన్‌గా రైట్‌ టర్న్‌ ఉండటంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. పెద్ద శబ్ధం రావటంతో షాక్‌కు గురయ్యా. సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే భయంతో ఏమైనా దెబ్బలు తగిలాయా లేదా చూసుకొని ఇంటికి పరిగెత్తాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో షూటింగ్‌కు హాజరవుతా’ అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *