‘జెర్సీ’ హిందీ షూటింగు లో హీరోకి గాయం

తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను హిందీ వెర్షన్‌లో అదే పేరుతో షాహిద్ హీరోగా నిర్మిస్తున్నారు. జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ వెర్షన్ లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ హిందీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అమన్ గిల్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే షూటింగు సందర్భంగా హీరో షాహిద్ కపూర్ క్రికెట్ ఆడుతున్నపుడు బంతి ఊహించని విధంగా వచ్చిముఖానికి  దిగువ పెదవిపై తగిలి తీవ్ర గాయమైంది. షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టరు అతని పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం అవడంతోపాటు వాపు తగ్గే వరకూ నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు షాహిద్‌కు సూచించారు. దీంతో ఈ సినిమా షూటింగును ఐదు రోజుల పాటు నిలిపివేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *