శీను సినిమాకు మళ్ళి ఇంత బడ్జెట్టా?

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎలాగైనా టాలీవుడ్ లో హీరోగా సెటిల్ చేయాలని ప్రతిజ్ఞ చేసినట్టు ఉన్నాడు. మొదటి సినిమా ‘అల్లుడుశీను’ హీరోగా అతని రేంజ్ కి మించి అతిగా ఖర్చుపెట్టి నష్టాలు మూటగట్టుకున్న సురేష్ ప్రయత్నాలు మాత్రం మానలేదు. ‘అల్లుడుశీను’ నిజానికి డీసెంట్ హిట్. వినాయక్ తనకు చేతనైనంత పరిధిలో మంచి మాస్ ఎంటర్టైనర్ గా తీసాడు. కాని సినిమా గ్రాండ్ గా రావాలన్న తలంపుతో అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడంతో రిటర్న్స్ విషయంలో తేడా కొట్టి ఒకదశలో బెల్లంకొండ సురేష్ అప్పుల పాలయ్యాడు అనే వార్తలకు కూడా అవకాశం ఇచ్చింది. ఇక రెండో సినిమా ‘స్పీడున్నోడు’ మరీ దారుణం. తమిళ్ లో సూపర్ హిట్ అయిన సుందర పాండ్యన్ రీమేక్ గా భీమినేని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఆ మూవీ వారంలోపే టపా కట్టేసింది. పేరుకి భీమినేని నిర్మాత అని, వెనుక నుంచి మొత్తం పెట్టుబడి సురేష్ పెట్టాడని టాక్. మొదటి సినిమా బాకీలు గురించి డిస్ట్రిబ్యూటర్లు వేధిస్తారని అలా చేసారని అప్పట్లో చెప్పుకున్నారు. అయినా ఫలితం శూన్యం. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నంలో పడ్డాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.

మాస్ సినిమాలు తీయడంలో చేయి తిరిగిన బోయపాటి శీను ఈ ఇయర్ లోనే టాప్ మోస్ట్ హిట్ ‘సరైనోడు’ ద్వారా తనకు మాస్ పల్స్ మీద ఎంత పట్టుందో మరోసారి ప్రూవ్ చేసాడు. కాని శీను సాధించిన హిట్లు అన్ని కూడా బలమైన స్టార్ సపోర్ట్ తో ఆ రేంజ్ సక్సెస్ సాధించగలిగాయి. ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం ఎలా ఉంటుందో ఎన్టీఆర్ ‘దమ్ము’ ఇంతకు ముందే రుచి చూపించింది. సో.. హండిల్ విత్ కేర్ అనేది బోయపాటి కూడా వర్తిస్తుంది. ‘సరైనోడు’ తర్వాత భారీ ఆఫర్స్ ఉన్నా కూడా వాటిని కాదని సాయిశ్రీనివాస్ తోనే కమిట్ అయ్యాడు బోయపాటి. ఇది గతంలో ఇచ్చిన మాట కోసం టేకప్ చేసిందిట. కాని ఇది కూడా బడ్జెట్ విషయంలో కాంప్రోమైజ్ కాకుండా ప్లాన్ చేయటమే విశేషం. హీరొయిన్ గా మోస్ట్ వాంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్ ని లైన్లో పెట్టారు. రెమ్యునరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తున్న విలన్ జగపతిబాబుతో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. మరో హీరొయిన్ గా క్యూట్ గర్ల్ ప్రగ్యా జైస్వాల్ ని ఓకే చేసుకున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తీస్తున్న ఈ మూవీలో ‘సరైనోడు’ని మించి మసాలా డోస్ ఉంటుందని టాక్. మరి ఈ ఇద్దరు శీనులు కలిసి చేస్తున్న ఈ మూవీ సాయిశ్రీనివాస్ కోరుకుంటున్న బ్రేక్ ఇస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *