హైద‌రాబాద్‌లో దారుణ‌మైన వ్య‌భిచారం

గ్రేట‌ర్ హైద‌ర‌బాద్‌లో పేద కుటుంబాల్లో పుట్టిన బాలిక‌ను టార్గెట్ చేస్తోన్న ఓ ముఠా వారి పేద‌రికాన్ని ఆస‌రాగా చేసుకుని వారిని వ్య‌భిచార ఊబిలోకి దింపి వారితో దారుణంగా వ్య‌భిచారం చేయిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ అంటేనే అక్క‌డ ముక్కుప‌చ్చ‌లార‌ని పేద బాలిక‌లు అర‌బ్‌షేక్‌ల చెర‌లో ఎలా బందీ అయిపోతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ ఓ భార్య‌భ‌ర్తల జంట పేద మైన‌ర్ బాలిక‌ల‌ను టార్గెట్‌గా చేసుకుంటూ వారిని వ్య‌భిచారంలోకి దింపుతోంది. ఈ క్ర‌మంలోనే ఓ పేద బాలిక‌కు పని ఇప్పిస్తామ‌ని చెప్పి ఆమెను మత్తు బిళ్లలతో మైకంలోకి దింపి పడుపు వృత్తి చేయించారు. తన బాధను ఎవరికి చెప్పాలో తెలియక రెండు నెలలు నరకం చవిచూసింది. విషయం తెలిసిన ఓ బంధువు సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

పాతబస్తీకు చెందిన 15 ఏళ్ల బాలికను పని కల్పిస్తామంటూ లంగర్‌హౌజ్‌కు చెందిన షాహీన్‌, ముక్తార్‌ దంపతులు తీసుకువచ్చారు. గోల్కొండ సమీపంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంలోకి బాలికను చేర్చారు. బలవంతంగా రొంపిలోకి లాగారు. తనను వదిలేయమంటూ ప్రాధేయపడుతున్నా భార్యభర్తలిద్దరూ బాలికను ఓ గదిలో బంధిం చేశారు. టాబ్లెట్స్‌, మత్తు పదార్థాలను ఇచ్చి మత్తులోకి చేరగానే విటులను పంపేవారు. అక్కడ నుంచి బయట పడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఏడుస్తూ కాలం గడుపుతూ వస్తోంది.

బాలిక త‌ల్లిదండ్రుల‌కు అనుమానం రాకుండా ఉండేందుకు వారికి ప్ర‌తి నెలా కొంత‌మొత్తం పంపుతూ ఉండేవారు. చివ‌ర‌కు బాలిక త‌న బంధువు సాయంతో అక్క‌డ నుంచి త‌ప్పించుకుని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ భార్య‌భ‌ర్త‌ల‌ను అరెస్టు చేసి, ఆ వ్య‌భిచార గృహంపై కూడా దాడి చేసి..మ‌రికొంత మందికి విముక్తి క‌లిగించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *