నా కెరీర్‌లో అదే పెద్ద తప్పిదం: గంగూలీ

తన క్రికెట్‌ కెరీర్‌లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపల్‌ను కావాలని కోచ్‌గా నియమించుకోవడమేనని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. తనను కెరీర్ పరంగా చాలా ఎక్కువ కష్టాలు గురి చేశాడని గంగూలీ తెలిపాడు. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుని నియంతలా వ్యవహరించేవాడన్నాడు. ఎవరి మాట వినిపించుకోకుండా అతన్ని కోచ్‌గా చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని గంగూలీ తెలిపాడు. తన ఆత్మకథ ఏ సెంచరీ ‘ఈజ్ నాట్ ఎనఫ్’ అనే పుస్తకంలో చాపెల్‌ గురించి ఆసక్తికర విషయాలను గంగూలీ పంచుకున్నాడు.

దాదాపు రెండేళ్లు(2005 మే నుంచి 2007 ఏప్రిల్‌) పాటు భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా పని చేసిన చాపెల్‌తో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గంగూలీ తెలిపాడు. చాపెల్‌ కోచ్‌గా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే తన కెప్టెన్సీ పోయిన విషయాన్ని దాదా ప్రస్తావించాడు.  అదే ఏడాది ఎటువంటి కారణం లేకుండా తనను ఆటగాడిగా కూడా తప్పించారని గంగూలీ తెలిపాడు. ఇందుకు కారణం.. తన మానసిక స్థితి బాలేదంటూ బీసీసీఐకి చాపెల్‌ రాసిన లేఖ కారణమన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *