హృతిక్, టైగర్ మధ్య ‘వార్’

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వార్‌’. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దిన ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌. ఇప్పుడు ఇద్దరూ తెరపై సందడి చేసేందుకు సిద్ధం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హృతిక్‌, టైగర్‌ మధ్య వచ్చే భారీ పోరాట సన్నివేశాలు, ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయిక. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో  అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *