డ్రగ్స్ రాకెట్ లో కేటీఆర్ ఫ్రెండ్స్?దిగ్విజయ్ సంచలన ట్వీట్

డ్రగ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సంచలన ఆరోపణ చేశారు.డ్రగ్ కుంభకోణంలో టిఆర్ఎస్ వారసుల హస్తం ఉందని డిగ్గీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో భారీ డ్రగ్ స్కాం జరిగిందని, అధికార పార్టీ వారసుల హస్తం ఉందని ట్వీట్ చేశారు. వారందరినీ విచారిస్తారో లేక రక్షిస్తారో చూడాలన్నారు.

దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఘాటుగా స్పందించారు. డిగ్గీ పూర్తిగా గతి తప్పారన్నారు. ఆయన గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు.

కేటీఆర్ కూడా వెనువెంటనే స్పందించారు. రిటైర్ అవ్వాల్సిన వయసులో… వయసుకు తగినట్లుగా నడుచుకోండి అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. నేటి ఉదయం 8.42 గంటలకు డిగ్గీరాజా ట్విట్టర్ లో ఎంట్రీ ఇవ్వగా ఓ గంటలోనే స్పందించిన కేటీఆర్ సరిగ్గా 10 గంటలకు తన రెస్పాన్స్ ను అదే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. డిగ్గీరాజా ట్వీట్ – కేటీఆర్ రీట్వీట్ తో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా వచ్చేసిందన్న వాదన వినిపిస్తోంది.

ఇప్పటి వరకు డ్రగ్ రాకెట్ రాజకీయ మలుపు తీసుకోలేదు. కానీ డిగ్గీ ట్వీట్‌తో ఇది రాజకీయంగా కూడా దుమారం రేపేలా కనిపిస్తోంది. డ్రగ్ రాకెట్‌లో కేవలం సినిమా పరిశ్రమ వారినే టార్గెట్ చేస్తున్నారని, అధికార పార్టీ వారి హస్తం కూడా ఉందని, కానీ వారిని మాత్రం పక్కకు తప్పించారని డిగ్గీ ట్వీట్‌లోని అభిప్రాయంగా చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *