నందమూరి బ్రదర్స్‌ ధాటి తీవ్రతరం

‘జై లవకుశ’ చిత్రంపై భారీ స్థాయిలో టేబుల్‌ ప్రాఫిట్‌ సంపాదించిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనకి వచ్చిన డబ్బుని దాచేసుకోకుండా, పబ్లిసిటీ పరంగా చాలా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ కెరియర్లో నిలిచిపోయే విజయాన్ని ఇవ్వాలని కళ్యాణ్‌రామ్‌ ఆశ పడుతున్నాడు. ఇకపై ఎన్టీఆర్‌కి ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ని హోమ్‌ బ్యానర్‌ చేసే స్థాయికి ఈ చిత్రాన్ని నిలబెట్టడం కోసం కళ్యాణ్‌రామ్‌ పబ్లిసిటీ పరంగా చాలా ఖర్చు పెడుతున్నాడు.

స్పైడర్‌ చిత్రానికి ప్రమోషన్స్‌ చాలా వీక్‌గా జరుగుతూ వుండగా, జై లవకుశ మాత్రం చాన్నాళ్లుగా పబ్లిసిటీలో ముందంజలో వుంది. ప్రింట్‌ మీడియా, విజువల్‌ మీడియా, వెబ్‌ మీడియా అన్నిట్లోను ఎటు చూసినా జై లవకుశ కనిపించేలా ప్లాన్‌ చేసారట. ఈ చిత్రం కోసం జనం బారులు తీరేలా ప్రోమోస్‌ కట్‌ చేసి పెట్టారట. టాక్‌ ఎలా వచ్చినా కానీ మొదటి వారంలో వసూళ్ల జాతర వుండి తీరాలని పక్కా స్ట్రాటజీతో వెళుతున్నారట.

జై లవకుశ చిత్రానికి చేస్తోన్న పబ్లిసిటీని అందుకోవడంలో మిగతా సినిమాలు విఫలమవుతున్నాయి. విడుదలకి ముందే భారీగా టేబుల్‌ ప్రాఫిట్స్‌ రావడం వల్ల లాభమేంటనేది కళ్యాణ్‌రామ్‌ చూపిస్తున్నాడు. ఇంత పబ్లిసిటీతో వచ్చి డీసెంట్‌ టాక్‌ తెచ్చుకున్నట్టయితే దసరా సెలవులు అయ్యేవరకు జై లవకుశ వసూళ్ల గురించి చింత అక్కర్లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *