భూమి బల్లపరుపుగా ఉందని నమ్మే హ్యూజ్…

భూమి బల్లపరుపుగా ఉందని బలంగా నమ్మేవారిలో హ్యూజ్ ఒకరు. గుండ్రంగా ఉందో నిర్ధరించుకుంటానని ఆయన 2018లో చెప్పారు. రాకెట్ ప్రయోగంతో అంతరిక్షంలోకి వెళ్లి తన అభిప్రాయాన్ని నిరూపించాలని ఆయన ఆశించారు.ఔత్సాహిక రాకెట్ తయారీదారులపై యూఎస్ సైన్స్ చానల్‌లో ప్రసారం కానున్న కొత్త టీవీ సిరీస్ ‘హోమ్‌మేడ్ ఆస్ట్రోనాట్స్’‌లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.సుమారు 18 వేల డాలర్లు వెచ్చించి హ్యూజ్, ఆయన అసిస్టెంట్లు హ్యూజ్ ఇంటి వద్ద ఈ రాకెట్ తయారుచేశారు.ఒక నాజిల్ గుండా వెలువడే ఆవిరితో ఈ రాకెట్ ముందుకు సాగుతుంది. పరిమితమైన బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు.64 ఏళ్ల ‘మ్యాడ్’ మైక్ హ్యూజ్ సొంతంగా తయారుచేసిన రాకెట్ ఇది. ఇది ఆవిరితో ప్రయాణిస్తుంది.హ్యూజ్ శనివారం బార్‌స్టో నగరానికి దగ్గర్లో కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు.ఆయన ప్రయాణిస్తున్న రాకెట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కూలిపోయింది. ఆయన చనిపోయారు. రాకెట్ గాల్లోకి దూసుకెళ్లి వెంటనే నేల కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో ఉంది.రాకెట్ పైకి లేచిన తర్వాత పారాచ్యూట్ చాలా ముందుగా తెరచుకొన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.హ్యూజ్ తన పార్ట్‌నర్ వాల్డో స్టేక్స్‌ సాయంతో ఈ రాకెట్‌తో ఐదు వేల అడుగుల (1,525 మీటర్ల) ఎత్తుకు చేరుకొనేందుకు ప్రయత్నించారని స్పేస్.కామ్ తెలిపింది.శనివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి తమ అధికారులను నిర్వాహకులు పిలిచారని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.రాకెట్ ఎడారిలో కూలిపోవడంతో ఒకరు చనిపోయారని షెరిఫ్ కార్యాలయం చెప్పింది.చనిపోయింది పైలట్ హ్యూజేనని హ్యూజ్ ప్రచారకర్త అమెరికా మీడియా సంస్థలకు స్పష్టం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *