మగాళ్ళ బట్టలే ఆమెకు నచ్చుతాయట

బాలీవుడ్ కి గ్లామర్ అద్దడంలో తన వంతు సాయం చేస్తుంటుంది సోనమ్ కపూర్. అందాల ప్రదర్శన.. ముఖ్యంగా క్లీవేజ్ ఎక్స్ పోజింగ్.. సోయగాలు కనిపించేలా డ్రెసింగ్ చేయడంలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోందనే టాక్ వినిపించడమే కాదు.. సాక్ష్యాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఏదైనా ఈవెంట్ లో ఈమె హాజరు ఉంటే చాలు.. కచ్చితంగా ఆ ఎగ్జిబిషన్ తప్పనిసరి అయిపోయింది.

ప్రస్తుతం ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతోంది. ఇక్కడకు కూడా తన స్టైల్ లోనే గ్లామర్ చిందిస్తూ అటెండ్ అయింది సోనమ్ కపూర్. ఈమెకు ఈ తరహా డ్రెసింగ్ పై.. గ్లామర్ కాస్ట్యూమ్స్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సోనమ్ నుంచి దిమ్మదిరిగే ఆన్సర్ వచ్చింది. అసలు గ్లామరస్ డ్రెసింగ్ సంగతి పక్కన పెడితే.. తనకు అమ్మాయిల డ్రెస్సులే నచ్చవని అంటోంది సోనమ్. తాను స్టైలిష్ గా ఉంటానని అందరూ భావిస్తారన్న ఈ భామ.. తనకు మాత్రం ఎప్పుడూ మగాళ్ళ కాస్ట్యూమ్స్ నచ్చుతాయని.. వారి దుస్తులు వేసుకోవడమే ఇష్టమని చెబుతోంది.

తాను ఇంత గ్లామర్ గా కనిపిస్తున్నానంటే అదంతా తన సోదరి రియా కపూర్ క్రెడిట్ అంటోంది సోనమ్ కపూర్. ఆమెతో వర్క్ చేస్తున్న టీంలో పలువురు ట్యాలెంటెడ్ పీపుల్ ఉన్నారని చెబుతోంది సోనమ్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *