విరాట్ కోహ్లీపై ఆ రూమరెందుకు.. అనుష్కశర్మ రుసరుస

ఫిలౌరీ చిత్రాన్ని విరాట్ కోహ్లీ నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఖండించారు. సినిమాలను నిర్మించే సత్తా నాకు ఉంది అని ఆమె స్పష్టం చేశారు. నా సినిమాలను నేను నిర్మించుకోలిగే సత్తా, ప్రమోట్ చేసుకోగలిగే సామర్థ్యం నాకు ఉంది అని వెల్లడించింది. ఫిలౌరీ చిత్రంతో అనుష్క శర్మ నిర్మాత మారింది.

ఫిలౌరీకి విరాట్ కోహ్లీ డబ్బులు పెట్టలేదు.

విరాట్ కోహ్లీ, అనుష్కల మధ్య చాలా కాలంగా అఫైర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ నటించి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫిలౌరీ సినిమాకు విరాట్ కోహ్లీ డబ్బులు పెట్టారని ఇటీవల మీడియాలో రూమర్లు వచ్చాయి. వాటిపై ఇటీవల స్పందించిన ఆమె పలు మీడియా చానెళ్లకు, పత్రికలకు అలాంటిదేమి లేదని సందేశం పంపింది.

ఫాక్స్ స్టార్‌ హిందీతో కలిసి ఫాక్స్ స్టార్‌ తో కలిసి

ఫిలౌరీపై వస్తున్న రూమర్లకు ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ హిందీ, క్లీన్స్ స్టేట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించింది. ఈ చిత్రానికి అన్షాయ్ లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 24 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సూరజ్ శర్మ, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

కార్ప్స్ బ్రైడ్ అనే సినిమాక కాపీనా

దెయ్యం కారణంగా ఓ పెళ్లి కొడుకు ఎదురైన సమస్యల ఆధారంగా కార్ప్స్ బ్రైడ్ యానిమేషన్ చిత్రం రూపొందింది. ఇందులో హీరో పాత్రకు ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ డబ్బింగ్ చెప్పారు. దెయ్యం పాత్రలో హెలెనా బోన్హామ్ కార్టర్ నటించింది. 2005లో విడుదలైన ఈ చిత్రానికి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించాడు.

బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అనుష్క

2008లో రబ్ నే బనా ది జోడి చిత్రంతో అనుష్కశర్మ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత బ్యాండ్ బజా బరాత్, లేడీస్ వర్సెస్ వికీ బెహెల్, జబ్ తక్ హై జాన్, పీకే, ఎన్‌హెచ్10, దిల్ దడ్కనే దో, సుల్తాన్, యై దిల్ హై ముష్కిల్ నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించాయి.

హీరోయిన్.. నిర్మాతగా అనుష్క

పలు సూపర్ హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న అనుష్క శర్మ ఫిల్లౌరీ చిత్రంతో నిర్మాతగా మారారు. రొమాంటిక్, కామెడీ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో దల్జిత్ దోసాన్, సూరజ్ శర్మ, మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *