ఆధార్ కార్డుపై అడ్రస్ మార్చుకోవాలంటే

చదువు, ఉద్యోగరీత్యా మరో చోటుకి వెళ్లాల్సి వస్తే.. మీ ఆధార్ కార్డుపై మీరు కొత్తగా వెళ్లిన తాత్కాలిక  మీ చిరునామాను మార్చుకోవచ్చు.  భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ అధికారిక  వెబ్‌సైట్‌  http://www.uidai.gov.in or https://resident.uidai.gov.in పై ఆధార్ అప్‌డేట్ సెక్షన్ కింద రిక్వెస్ట్ ఆధార్ వ్యాలిడేషన్ లెటర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (ఎస్ఎస్‌యూపి) విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ కార్డు.. మీ ప్రస్తుత చిరునామా వివరాలను ఓపికగా పొందుపరుస్తు కొన్ని వివరాలు సమర్పించాలి. అనంతరం పలు ఎస్ఎంఎస్, ఓటీపిల రూపంలో మీ రిజిష్టర్స్ మొబైల్ నెంబర్‌కి ఓ సీక్రెట్ కోడ్ వస్తుంది. అదే సమయంలో మీ రిక్వెస్ట్ వెరిఫయర్‌కి సైతం వెళ్తుంది. తద్వారా మీ దరఖాస్తును వెరిఫయర్ ధృవీకరించుకునేందుకు వీలుంటుంది. అలా దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ మీకు 0000/00XXX/XXXXX రూపంలో ఓ అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) జారీచేస్తుంది. ఆ యూఆర్ఎన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవడం ద్వారా మీ ఆధార్ కార్డుపై అడ్రస్ అప్‌డేట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరే నేరుగా తెలుసుకోవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *