యాపిల్ ఫోన్ యూజర్లకు ముఖ్య హెచ్చరిక !

యాపిల్‌ ఐఫోన్లు వాడేవారు మెసెజ్‌ అటాచ్‌మెంట్లతో మాల్‌ వేర్‌ ఎటాక్‌ చేస్తుంది. ఐవోఎస్‌ 9 నుంచి ఐవోఎస్‌ 10.2.1 మధ్య వర్షన్లు ఉన్న ఫోన్లకు ఐమెసెంజర్‌కు ఏదైనా ఎటాచ్‌మెంట్‌ ఫైల్‌ వస్తే కంగారు పడి క్లిక్‌ చేయోద్దు.. ముఖ్యంగా అన్‌నౌన్‌ నంబర్ల నుంచి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. తాజాగా ఒక మాల్‌వేర్‌ మెసెజ్‌ యాప్‌ని ఆటోమేటిగ్గా డిజేబుల్‌ చేస్తుంది.

సంబంధిత అటాచ్‌మెంట్‌ వస్తే డౌన్‌లోడ్‌ చేయాలని క్లిక్‌ చేస్తే చాలు ముందు మెసెంజర్‌ ఫ్రీజ్‌ అవుతుంది.. దేన్ని క్లిక్‌ చేసినా తిరిగి పనిచేయదు.. చివరకు స్వైపింగ్‌ సాయంతో ఆ ట్యాబ్‌ క్లోజ్‌ చేసినా.. ఆ ఫోన్‌కు తిరిగి ఐమెసెంజర్‌ అనేది పనిచే యదు.. రీబూట్‌ లేదా రీసెట్‌ చేసుకున్నా సమస్య పరి ష్కారం కావడం లేదు. ఈ విషయాన్ని ఒక యూట్యూబ్‌ ఛానల్‌ కొనుగొంది.. దానికి సంబంధిచిన వీడియో సైతం అప్‌లోడ్‌ చేసింది.. ప్రస్తుతం ఈ మెసెజ్‌ బారిన పడిన ఐఫోన్లకు తిరిగి ఓటీఏ అప్‌డేట్‌ ఇచ్చేందుకు యాపిల్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త అప్‌డేట్‌ వచ్చే వరకు ఐమెసెంజర్‌ పనిచేయదు.. అందుకే అన్‌నౌన్‌ అటాచ్‌మెంట్స్‌ వచ్చినప్పుడు క్లిక్‌ చేయకుండా వదిలేయడం ఉత్తమం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *