భారత్ ఆందోళన..

ఇటీవల పాకిస్థాన్‌కు 125 మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించడానికి అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు ఎఫ్‌-16 విషయంలో సైనిక సహకారం కల్పించాలన్న అమెరికా నిర్ణయం పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్ మాట్లాడుతూ..‘‘ ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారితో పాటు వాషింగ్టన్‌లోని ట్రంప్‌ పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లాం. పాక్‌కు సైనిక సహకారం అందించడంపై భారత్‌ ఆందోళనను వారికి తెలియజేశాం’’ అని తెలిపారు. అయితే ఇది కేవలం ఎఫ్‌-16కు సాంకేతిక సహకారం, అదనపు హంగులు, శిక్షణ అంశాలు, పూర్తి స్థాయి పర్యవేక్షణకు మాత్రమే పరిమితమని.. పూర్తి స్థాయి సైనిక సహకారం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అమెరికా స్పష్టం చేసిందన్నారు. పాకిస్థాన్‌కు రూ.860 కోట్లు విలువ చేసే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విక్రయించనుంది. ఈ సొమ్మును ఎఫ్‌-16 యుద్ధ విమానాల పర్యవేక్షణ నిమిత్తం పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న 60 మంది అమెరికా కాంట్రాక్టర్లకు జీతాల చెల్లింపు నిమిత్తం ఉపయోగించనుంది. ఎఫ్‌-16లను ఏ విధంగా ఉపయోగిస్తున్నదీ వారు ప్రతిక్షణం పర్యవేక్షిస్తుంటారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *