అమరులకు ప్రముకుల నివాళులు

ఆపరేషన్‌ విజయ్‌కి గుర్తుగా ఏటా జులై 26న కార్గిల్‌ దివస్‌ను జరుపుకుంటారు. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ వేదికగా.. ఆనాటి అమరవీరుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.‘‘కార్గిల్‌ దివస్‌.. కార్గిల్‌ యుద్ధంలో భారత సేనలు ప్రదర్శించిన వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సిన రోజు ఈ సందర్భంగా.. దేశ రక్షణ కోసం తమ శౌర్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించిన వీరులందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ఆ అమరులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

జమ్ముకశ్మీర్‌ ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేందర్‌ సింగ్‌ ధనోవా అమరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం ద్రాస్‌కు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరులను నివాళులర్పించారు. అలాగే సైనిక ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు సైతం స్మారకం వద్దకు చేరుకొని వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘1999లో కార్గిల్‌ యుద్ధం సందర్భంగా భారత సేనలను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం లభించింది. అప్పట్లో నేను జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాను. సైనికులను కలిసి వారితో ముచ్చటించడం ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *