వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్(2), రోహిత్ శర్మా(18) విఫలమవ్వడంతో ఆ బాధ్యతాంత కెప్టెన్ కోహ్లీ మీద పడింది. బ్యాట్‌తో సారథి కోహ్లీ (120; 125బంతుల్లో 14×4, 1×6), బంతితో భువనేశ్వర్‌ కుమార్‌(4/31) చెలరేగారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. కానీ భారత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్ పోరాటం 42 ఓవర్లకు 210 పరుగుల వద్దే ముగింసింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత బౌలర్లు షమి రెండు, కుల్దిప్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. ఈ విజయంతో భారత్ వన్డే సిరీస్ లో బోణి కొట్టింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మూడు వన్డే ఈ నెల 14వ తేదీన జరగనుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *