‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ ప్రమాదం

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.! చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా  క్రేన్ పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ కు కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తృటిలో తప్పించుకున్నారు.  నటుడు కమల్ హాసన్ గాయపడకుండా తప్పించుకున్నారని ఈ ఘటనపై నటుడు కమల్‌హాసన్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ట్విట్టర్‌లో ఆయన స్పందించారు.ఘటన తన మనసును కలచివేసిందని, ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. తన బాధ కన్నా..కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కమల్‌హాసన్‌ వ్యక్తం చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *