విమానయానం రూ. 1999లకే

న్యూఢిల్లీ నుంచి జోధ్‌పూర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌ 5 నుంచి నేరుగా విమాన సర్వీసులను అందించడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిద్ధమైంది. ఈ రూట్‌లో విమాన చార్జీలను రూ 1999గా నిర్ణయించి విమాన ప్రయాణీకులకు తీపి కబురు అందించింది. జోధ్‌పూర్‌తో పాటు ఢిల్లీ-అగర్తలా, ఢిల్లీ -దిబ్రూగఢ్‌ రూట్లలోనూ డైరెర్ట్‌ ఫ్లైట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే నెల 14న ఈ రూట్లలో విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది. అగర్తలా, దిబ్రూగఢ్‌ రూట్లలో విమాన చార్జీలను వరుసగా 3,9999, 4999లుగా నిర్ణయించింది. మరో వైపు ఢిల్లీ, ముంబైలను కలుపుతా ఆరు నూతన అంతర్జాతీయ విమానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ-జెడ్డా, ముంబె-దిబ్రూగఢ్‌ రూట్లలో ఇవి సేవలు అందిస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్‌ వెల్లడించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *