ఇంటర్వ్యూ : ప్రభాస్- నేను రాజమౌళి విజన్ ను నమ్మి ఆయన వెనకే వెళ్ళాను.

ప్ర) ‘బాహుబలి’కి సంబందించిన పనులన్నీ అయిపోయాయి కదా.. మీకెలా అనిపిస్తోంది ?
జ) నేనింకా బాహుబలి ఫీవర్ నుండి బయటకు రాలేదు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది టెంక్షన్ ఇంకా పెరుగుతోంది. ఒకసారి సినిమా రిలీజై మా పనిని ఆడియన్స్ మెచ్చుకుంటే తప్ప రిలాక్స్ అనేది ఉండదు.

ప్ర)’బాహుబలి’ ప్రాజెక్ట్ తో మీ ఐదేళ్ల ప్రయాణాన్ని ఎలా డిఫైన్ చేస్తారు ?
జ) నా అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. రాజమౌళి డ్రీమ్ ను ఫాలో అయిపోయాను. ప్రాజెక్ట్ ఆరంభంలో ప్రతిదీ ఒక ప్రయోగంలానే ఉండేది. మొదటి భాగానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకోలేదు. ఒకసారి వివి. వినాయక్ గారు మాట్లాడుతూ ఇన్ని ప్రశ్నలతో ఉన్న సినిమా ఎలా హిట్టైంది అన్నారు. అప్పుర్థమయింది ప్రేక్షకులు మా విజన్ ను ఎంకరేజ్ చేశారని. ఆ తర్వాత మాలో కూడా భాద్యత ఎక్కువైంది. కొంచెం నమ్మకం పెరిగింది. కానీ ఇన్ని భారీ అంచనాలను క్యారీ చేయడం ఎలా అనే చిన్న టెంక్షన్ కూడా పట్టుకుంది.

ప్ర) కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఇంత పెద్ద హిట్టవుతుందని మీరనుకున్నారా ?

జ) ఈ ప్రశ్న ఇంత పెద్ద హిట్టవుతుందని అస్సలు అనుకోలేదు. కేవలం ఇది సినిమా ముగింపుకు ఒక మంచి బ్యాంగ్ మాత్రమే అవుతుందని అనుకున్నాం. కానీ అనుకోకుండా అదే పెద్ద హిట్టై సినిమాకి కావాల్సినంత హైప్ తెచ్చిపెట్టింది.

ప్ర) మీరు నటించిన రెండు పాత్రల్లో మీకు ఎక్కువగా ఏది ఇష్టం ?
జ) శివుడి పాత్ర చాలా ఈజీగా చేశాను. ఎందుకంటే అందులో ఎలాంటి రూల్స్ ఉండవు. చాలా ఫ్రీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ రాజు పాత్ర అలా కాదు. దానికంతో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారమే నేను నడుచుకోవాలి. ఆ రెండు పాత్ర మధ్య కొంచమే తేడా ఉంటుందని అనుకుంటాం. కానీ నేను మాత్రం ఆ పాత్ర కోసం నాలుగేళ్లు వర్కవుట్స్ చేశాను.

ప్ర) రానాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది ?
జ) రానా పాత్ర సినిమాకి చాలా ముఖ్యమైంది. అలాంటి నెగెటివ్ రోల్ చేయడానికి ఘట్స్ ఉండాలి. అతన్ని సెకండ్ పార్ట్ లో చూపించిన విధానం భయంకరంగా ఉంటూనే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అతను చాలా గొప్పగా చేశాడు. అతనితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

ప్ర) చిత్రీకరణ సమయంలో ఎలా ఉండేది ?
జ) ప్రతిరోజూ ఒక కొత్త అనుభవమే. వేల మంది టెక్నీషియన్స్, ఎక్కడా తప్పు జరగడానికి ఆస్కారం లేదు. ఒక్కోసారి ఇంకో టేక్ అడగడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగి షాట్ సరిగా రాకపోతే మళ్ళీ అంతా సెటప్ చేసుకోవడానికి కొన్ని గంటల సంయమ పడుతుంది.

ప్ర) ఈ సినిమా ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అవుతుందని ఎప్పడనిపించింది ?
జ) రాజమౌళి నాకు వాటర్ ఫాల్ సీన్ ను వివరిస్తూ ప్రవాహం మేఘాల్లోంచి వస్తుంది అని చెప్పగానే అప్పుడారథమయింది రాజమౌళి విజన్ ఏమిటి అని. అప్పుడే అనుకున్న ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ అవుతుందని. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అన్ని హాలీవుడ్ సినిమాల్లో కన్నా ఈ సినిమాలోనే వాటర్ ఫాల్ సీన్ గొప్పగా ఉంటుంది.

ప్ర) బాహుబలిలో అన్నిటికన్నా కష్టమైన భాగం ఏది ?
జ) ఖచ్చితంగా పెట్టిన డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోవడమే అన్నింటికన్నా పెద్ద కష్టం. రాజమౌళితో సహా అందరం ప్రతిరోజు దీని గురికిన్చే టెంక్షన్ పడే వాళ్ళం. ప్రతిదీ అస్పష్టానంగానే ఉంటుంది. మొదటి భాగం పెద్ద హిట్టైన కూడా నిర్మాతలకు డబ్బులు రావడం కష్టమైంది. ఇక రెండవ భాగమైన మంచి డబ్బులు రావాలి.

ప్ర) ఈ ప్రాజెక్టులో వేరే సినిమాలు చేయని నటుడు మీరొక్కరే ఎందుకు ?

జ) చాలా సింపుల్ నేను రాజమౌళి విజన్ ను నమ్మి ఆయన వెనకే వెళ్ళాను. నేను ఈ సినిమాకి చేసిన ఫెవర్ ఏమైనా ఉందంటే అది నేనీ సినిమాకి ఎక్కువ వర్కింగ్ డేస్ కేటాయించడమే. చాలా మంది నన్ను వేరే సినిమా చేయమని అన్నారు. కానీ నేను మాత్రం రాజమౌని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదు. ఆయనకెప్పుడూ నేను అందుబాటులోనే ఉంటానని ఆయనఫీలయ్యేలా చేయాలని అనుకున్నాను.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *