బెంగళూరుపై కోల్‌కతా రికార్డులే రికార్డులు: నరైన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, 30 బంతుల్లో 105 రన్స్

చిన్నస్వామిలో వర్షం కురిసింది. ఐపీఎల్లో సరికొత్త ఆటను చూపించారు కోల్‌కతా ఓపెనర్లు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పలు రికార్డులను బద్దలు చేశారు.

పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు

14, 6, 14, 25, 26, 20.. ఇదీ కోల్‌కతా ఓపెనర్లు క్రిస్‌లిన్‌, నరైన్‌ పవర్‌ప్లే ఓవర్లలో చేసిన స్కోర్. వారి వూచకోతకు పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు 105/0 చేసిన జట్టుగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. వీరిద్దరికి బౌలింగ్ ఎలా చేయాలో బౌలర్లకు అర్థం కాలేదు.

వేగవంతమైన అర్ధశతకం
ఈ సీజన్‌లో కోల్‌కతా తరఫున మెరుపులు మెరిపిస్తున్న నరైన్‌ (54 పరుగులు, 17 బంతుల్లో 6×4, 4×6) ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 15 బంతుల్లో 50 పరుగులు చేశాడు. క్రిస్‌లిన్‌ (22 బంతుల్లో 5×4, 4×6లతో 50 పరుగులు) చేశాడు.

కోల్‌కతా బ్యాటింగ్
– కోల్‌కతా 20 ఓవర్లలో 159 పరుగులు చేసి, లక్ష్యాన్ని చేధించింది.
– గంభీర్ 16 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
– గ్రాండ్ హామ్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
– లిన్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అవుటయ్యాడు.
– బౌలర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడాడు. అతను ఐపీఎల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అరవింద్ బౌలింగులో వరుసగా 4, 4, 4, 6, 4 కొట్టాడు. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు.

బెంగళూరు బ్యాటింగ్

– హెడ్, మన్ దీప్ కారణంగా బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
– నాటౌట్‌గా నిలిచిన హెడ్ 47 బంతుల్లో 75 పరుగులు చేశాడు.
– నేగీ 3 బంతుల్లో 5 పరుగులు చేశాడు – జాదవ్ 9 బంతుల్లో 8 పరుగులు చేశారు.
– మన్ దీప్ సింగ్ 43 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
– బెంగళూరు 14.1 ఓవర్లో వంద పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది.
– డివిల్లియర్స్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యాడు.
– విరాట్ కోహ్లీ 9 బంతుల్లో అయిదు పరుగులు చేశాడు.
– విధ్వంసక వీరుడు క్రిస్ గేల్‌ తన పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. కెరీర్‌లో ఆడుతున్న 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే గేల్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వచ్చిన బంతిని ఆన్‌సైడ్‌ ఆడాలని ప్రయత్నించి వదిలేయబోయాడు. అప్పటికే బ్యాట్‌ అంచుకు తాకి గాల్లోకి లేచిన బంతిని కోల్‌కతా గౌతమ్‌ గంభీర్‌ అందుకొన్నాడు. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 152 పరుగులు చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *