IPL 2021 Match 33 SRH సన్ రైజర్స్ హైదరాబాద్ DC ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2021 Match 33 SRH vs DC Sunrisers Hyderabad v Delhi Capital Preview Prediction Final Playing 11

ఐపీల్ 2021 మ్యాచ్ 33 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో తలపడనున్నారు. ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న హైదరాబాద్ జట్టు, టాప్ 2 లో ఉన్న ఢిల్లీ తో ఆడనుంది.

మరి అనిశ్చితికి మారు పేరు అయినటువంటి క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు. అదీ గాక హైదరాబాద్ టీం భరత్ కి వెలుపల మంచి రికార్డు ఉంది కాబట్టి, ఒక డిఫరెంట్ టీం ని మనం చూడొచ్చు. SRH బౌలర్ నటరాజన్ తిరిగి జట్టులో చేరడంతో బౌలింగ్ డిపార్ట్మెంట్ మెరుగుపడింది. కానీ కీపర్ , ఓపెనర్ జానీ బైర్ స్టో జట్టును వీడడంతో బాటింగ్ లో కొంత వరకు దాని ప్రభావం ఉంటుంది. మరి వృద్ధిమాన్ సహా ఆ లోటు పూర్తి చేస్తే ఇక హైదరాబాద్ కి తిరుగే ఉండదు.

ఇక ఢిల్లీ పూర్వపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. దాంతో 3 వ స్థానం లో ఆడుతున్న స్మిత్ కి అవకాశం దొరకక పోవచ్చు. ఇక ఇప్పటివరకు సీజన్లో లో మాంచి ఫార్మ్ లో ఉన్న ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్ మరియు ప్రిథ్వీ షా లు ఇప్పుడు మరింతగా చెలరేగి ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే, వీరికి టీ 20 వరల్డ్ కప్ కి భరత్ టీం లో స్థానం దక్కలేదు కాబట్టి, ఆ కసి మీద ఉంటారు.

హైదరాబాద్ ఢిల్లీ ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది, మరి ఈ మ్యాచ్ కూడా అంతే రసవత్తరంగా జరగాలని ఆశిద్దాం.

Probable Playing XIs:

Sunrisers Hyderabad
David Warner, Kane Williamson (C), Wriddhiman Saha, Manish Pandey, Vijay Shankar, Mohammad Nabi/Sherfane Rutherford/Jason Holder, Abdul Samad, Rashid Khan, Bhuvneshwar Kumar, Sandeep Sharma, Khaleel Ahmed

Delhi Capitals
Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer, Steven Smith/Shimron Hetmyer, Rishabh Pant (C and WK), Marcus Stoinis, Ravichandran Ashwin, Axar Patel, Kagiso Rabada, Anrich Nortje, Avesh Khan

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *