ఐపీల్ (IPL2021) టైటిల్ గెలిచిన చెన్నై(CSK)

IPL2021 Champions Chennai Super Kings (CSK) ఐపీల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్:

శుక్రవారం నాడు దుబాయ్ లో జరిగిన ఐపీల్(IPL2021) ఫైనల్ మ్యాచ్ లో గెలిచి టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్. దీనితో చెన్నై ఐపీల్ 4 వ సారి ఛాంపియన్స్ గా నిలిచారు. ధోని కి ఈ సీసన్ ఐపీల్ లో కెప్టెన్ గా ఆటగాడిగా చివరిది, టైటిల్ గెలవడంతో, మాంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు చెన్నై అభిమానులు.

యూఏఈ కి వచ్చినప్పటినుంచి అద్భుత ప్రదర్శన ఇచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ కి ఫైనల్ లో నిరాశే మిగిలింది. టాస్ గెలిచిన కోల్కతా చెన్నై ని బాటింగ్ కి ఆహ్వానించింది. చెన్నై బాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ మరియు రాబిన్ ఉతప్పలు కోల్కతా బౌలర్ల పై విరుచుకుపడ్డారు. చివరలో మొయిన్ అలీ కూడా సూపర్ స్ట్రైక్ తో బాటింగ్ చేయడంతో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.

193 పరుగుల విజయ లక్ష్యంతో బాటింగ్ కి దిగిన కోల్కతా కు ఓపెనర్లు శుబ్మన్ గిల్ మరియు వెంకటేష్ అయ్యర్ లు ఇద్దరు హాఫ్ సెంచరీ లు చేసి మంచి ఆరంభాన్ని అందిచారు, కానీ దాని తరువాత ఏ ఒక్క బ్యాట్స్ మన్ కూడా పరుగులు చేయలేక పోయారు. నితీష్ రానా కేవలం ఒక బంతికే అవుట్ అయ్యాడు, రాహుల్ త్రిపాఠి గాయం పాలై మ్యాచ్ చేజారి పోయాక దిగిన ఫలితం లేకపోయింది.

చెన్నై బాట్స్మన్ మంచి స్కోర్ సాధించడం తో ధోని తన బౌలర్లను ఉపయోగించి కోల్కతా ను కట్టడి చేసాడు. చెన్నై యువ అతగాడు ఋతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరంజ్ కాప్ సాధించాడు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ కాప్ సాధించాడు.

2021 ఐపీల్ విజేత చెన్నై కి 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా, రన్నర్ అప్ కోల్కతా కు 12. 5 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *