రూ. 10 లక్షలు డిపాజిట్ చేశారా ? మీ పని అంతే..

ముంబై: 2016 నవంబర్8వ తేది తరువాత బ్యాంకుల్లో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి మీద ఐటీ అధికారులు కన్ను వేశారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాదారులను 15 రోజుల్లో విచారించడానికి ఐటీ అధికారులు సిద్దం అయ్యారు. పెద్దనోట్లు రద్దు అయిన తరువాత దేశంలోని వివిద బ్యాంకుల్లోని 1.5 లక్షల అకౌంట్లలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేశారని అధికారులు గుర్తించారు. వీరు ఆదాయ పన్ను చెల్లించారా ? లేదా ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారు ఆన్ లైన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ నగదు ఎలా వచ్చింది ? అనే విషయం ఐటీ అధికారుల ముందు దృవీకరించాలి.

అధికారులకు అనుమానం వస్తే వారు అడిగిన అన్ని దృవీకరణ పత్రాలు సమర్పించలవలసి ఉంటుంది. పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత ఐటీ అధికారులు 1,100 చోట్ల దాడులు చేశారు. అందులో రూ. 600 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ. 600 కోట్ల అక్రమ నగదులో రూ. 150 కోట్ల విలువైన కొత్త నోట్లు ఉన్నాయి. దేశంలోని 1,5 లక్ష్లల బ్యాంకు అకౌంట్లలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేశారని వెలుగు చూసింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తే రూ. 50,000 కోట్ల ఆదాయ పన్ను వసూలు చెయ్యవచ్చని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని వివిద బ్యాంకుల్లో ఉన్న కోటి అకౌంట్లపై అనుమానాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *