పీడకలల ఉందన్న కేన్ విలియమ్సన్…

ప్రపంచ కప్ విజేతగా నిలిచేందుకు చివరిదాకా పోరాడి త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి నిరాశే ఎదురయ్యింది. దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధపడుతూ ‘నిరాశ మమ్మల్ని ఉప్పెనలా ముంచెత్తింది. ఉదయం లేచి చుస్తే అంత పీడకలల అనిపిస్తుంది. మా ఆటగాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. మ్యాచును ఈ రకంగా ఓడటం ఏదోలా ఉంది’ అని అన్నారు. ఆదివారం మ్యాచ్ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ బౌండరీల లెక్క నిబంధనపై స్పందిస్తూ…బౌండరీల బట్టి విజేతను నిర్ణయించడం సరైనదా అంటే సమాధానం ఇవ్వలేను, నిజానికి ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని గని, నేను జవాబు ఇవ్వల్సివస్తుందని గని ఉహించలేదు’ అన్నారు.

ఇప్పటికి మేము బాధలోనే ఉన్నాం. రెండు జట్లు ఇంత కష్టపడిన తరువాత ఫలితం ఈ రకంగా రావడం జీర్నించు కోలేకపోతున్నామని, ఇది సిగ్గుచేటని చెప్పారు. కానీ క్రీడస్పుర్తిని ప్రదర్శిస్తూ నిబంధాలని విమర్శించలేదు. ఇలాంరి నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితం తేలాల్సి వస్తుందని ఎవరు ఉహించలేదు. ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ దీన్ని అందరూ ఆస్వాదించారని చెప్పారు. నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కోపం లేదు కానీ కొంత నిరాశ అయితే ఉంది అని విలియమ్సన్ చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *