మీ ఆతిథ్యం..సూపర్ కేసీఆర్ కు ఇవాంకా ట్రంప్ లేఖ

హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ పెన్యూర్ సమ్మిట్ సక్సెస్ తీపికబుర్ల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో అంశం తోడయింది. జీఈఎస్ సక్సెస్ పై పలు వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతుండగా ఈ జాబితాలో తాజాగా అనూహ్యమైన అంశం చేరింది. జీఈఎస్ నిర్వహణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వ్యక్తిగతంగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడం గమనార్హం.

జీఈఎస్ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యానికి ఈ లేఖలో ఇవాంకా కృతజ్ఞతలు చెప్పారు. `జీఈఎస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికన తీరు అనిర్వచనీయం – స్పూర్తిదాయకం. భవిష్యత్ లో అవకాశం దొరికితే మళ్లీ హైదరాబాద్ కు వస్తాను` అని అందులో పేర్కొన్నారు. జీఈఎస్ సాగుతున్న సమయంలో ఫలక్ నామ ప్యాలస్ లో తెలంగాణ ప్రభుత్వం అందించిన కానుక గొప్ప అనుభూతిని కలిగించిందని ఇవాంకా సంతోషం వ్యక్తం చేశారు. ఈ లేఖ కారణంగా తెలంగాణ ప్రభుత్వం – టీఆర్ ఎస్ వర్గాలు ఖుష్ అవుతుండటం గమనార్హం. కాగా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి జీఈఎస్ సదస్సును విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా సాగిన ఈ సదస్సును గ్రాండ్ సక్సెస్ చేశారని ఇవాంకా తనతో వ్యక్తీకరించారని ట్రంప్ ప్రధానితో చెప్పినట్లు పీఎంఓ వెల్లడించింది.

కాగా ట్రంప్-మోడీ ఫోన్ కాల్ – ప్రస్తుతం ఇవాంకా లేఖతో తెలంగాణ సర్కారు హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ రాకతో తమకు గుర్తింపు దక్కిందని – ఈ విషయంలో ప్రధాని మోడీతో ట్రంప్ ఫోన్ సంభాషణ – తాజాగా ఇవాంకా లేఖ ద్వారా హైదరాబాద్ ఖ్యాతీ – తమ పరిపాలనకు మరో కితాబు దక్కిందని అంటున్నారు. ఈ పరిణామం తమ సక్సెస్ జాబితాలో చేరుతుందని టీఆర్ ఎస్ వర్గాలు ఖుష్ అవుతున్నాయి. అంతర్జాతీయ యవనికపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేందుకు జీఈఎస్ తోడ్పడిందని అంటున్నారు. ప్రధానంగా టీఆర్ ఎస్ యువనేత – మంత్రి కేటీఆర్ కు గుర్తింపు దక్కేందుకు ఉపయుక్తంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

జీఈఎస్ సదస్సులో వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా మంత్రి కేటీఆర్ వదులుకోకుండా తెలంగాణ అనుసరిస్తున్న విధానాల గురించి విపులాత్మకంగా చెప్పారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాల గురించి వివరించడంలో మంత్రి కేటీఆర్ సఫలం అయ్యారని వివరిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *