‘జబర్దస్త్’కమిడియన్ కి త్రుటిలో తప్పిన కారు ప్రమాదం

హైదరాబాద్: ఈటీవిలో పాపులర్ పోగ్రామ్ …’జబర్దస్త్’ తో పాపులర్ అయిన నటుడు వెంకీ (వెంకీ..మంకీ ) కి త్రుటిలో ప్రమాదం తప్పింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు స్వయంగా కారు డ్రైవింగ్‌ చేస్తూ వస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండల సరిహద్దులో ఆర్టీసీ బస్సు వెంకీ కారును ఓవర్‌టేక్‌ చేసింది.

ఇదే సమయంలో వెంకీ తన కారును కొద్దిగా స్లో చేయగా వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా వాహనం అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకీ క్షేమంగా బయట పడగలిగాడు. ఇన్నోవా కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై వెంకీ ఆలేరు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *