యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘పటేల్ సర్’

ఇపుడు విలన్ అయినా, తండ్రి అయినా బాబాయ్ అయినా ఎలాంటి పాత్రలకైనా దర్శకులకి మొదట గుర్తొచ్చే పేరు.. జగపతి బాబు.. ఇప్పుడు జగపతి బాబు సరికొత్త లుక్ తో మళ్ళీ హీరో గా మన ముందుకు వస్తున్నాడు.. ఆయనే పటేల్ సర్..జగపతి బాబు.

సినిమాను ప్రారంభించడమే కాదు.. ఆ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పుడీ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.  27 లక్షల వ్యూస్‌తో సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత సాయి కొర్రపాటి సినిమా కోసం జగపతి బాబు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. యాక్షన్‌ సీన్స్‌లో జగపతి నటన హాలీవుడ్‌ స్థాయిలో ఉందని  ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయని చెప్పారు. వాసు దర్శకత్వం అద్బుతంగా ఉందని సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నారు. సినిమాను జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

యాక్షనం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ కిల్లర్ పాత్రలో జగ్గూ భాయ్ కనిపించబోతున్నాడు. వైట్ హెయిర్‌తో ఓ ఏజ్ డ్ పర్సన్‌గా  పూర్తిగా ఫిట్ బాడీతో మెస్మరైజ్ చేశాడు. కాల్ మీ సర్ ఓ చిన్నపిల్లతో అవ్వా బుజ్జి అవ్వా బుజ్జి ఆటే ఆడుదాం అంటూ టీజర్‌లో చెప్పే డైలాగులు అదిరిపోయాయి.  డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ, యాక్షన్‌ సీక్వెన్సెస్‌.. ఇలా ఒకటేమిటి, టీజర్‌లో అన్నీ హైలైట్సే. అన్నిటికీ మించి జగపతిబాబు సూపర్‌ హైలైట్‌. జగపతిబాబు మామూలోడు కాదు సుమీ.. అన్పించేలా వుందీ ‘పటేల్‌ సర్‌’ టీజర్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *