జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా

తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. టెన్త్ పాస్ అయిన వారు, ఆపై ఉన్నత విద్యార్హత కలిగిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) పథకం లో భాగంగా, తెలంగాణలోని పార్లమెంటు నియోజక వర్గాలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతతో పాటు ఇతరులు కూడా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. లాజిస్టిక్స్, రిటెయిల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఆయా రంగాల కంపెనీలు జాబ్మేళాలో పాల్గొంటున్నాయి. వీటితోపాటు బిపిఓ, ఎలక్ర్టానిక్స్, అగ్రిబేస్డ్ కంపెనీలు, ఫార్మసీ సంస్థలు, హోటల్ పరిశ్రమ, బ్యూటీ అండ్ వెల్నెస్, సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటాయి.

ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత తమ వెంట లేటెస్ట్ రిజ్యూమ్ను తెచ్చుకోవాలసి ఉంటుందని తెలంగాణ జాగృతి స్కిల్స్ డెవలప్మెంట్ ట్రయినింగ్ సెంటర్ సిఇఓ అబ్ధుల్ బాసిత్ తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ దోమలగూడలోని నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా కాని 040-40214215 నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

Skill development Contact Numbers:

Hyd – Ashoknagar – 040 – 40214215,
Hyd – Charminar – 040-24410211,
Bhongir- 08685244266,
Khammam -08742234215,
Mahabubnagar – 08686793145,
Mancherial -08736253535,
Nirmal- 08734244466,
Dilkhuknagar-04024147555,
Karimnagar-0878-6515666,
Nizamabad-08462240678,
Wanaparthy- 09642435228,
Zaheerabad-07451280822,
Nalgonda- 08682247227,
Hanamkonda- 08702554333,
Siddipet – 08457231234

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *