జై లవకుశ పై బిగ్ బాస్ ఎఫెక్ట్: వెనక్కి తగ్గిన ఎన్టీఆర్

టాలీవుడ్ యాక్టర్ ఎన్డీఆర్ జై లవకుశ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం పూణేలో కొనసాగుతున్నది. ఎన్డీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెపుడా ఎదురుచూస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకను చిత్రయూనిట్ త్వరలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేసిందట.

తాజాగా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఆడియో ఆల్బంను విడుద‌ల చేసేందుకు టైం ఫిక్స్ చేసింది. సెప్టెంబ‌ర్ 3న సాంగ్స్ అన్నింటిని డైరెక్ట్‌గా నెట్‌లోకి విడుదల చేయ‌నుంది చిత్ర బృందం. ఇక అభిమానుల కోసం సెప్టెంబ‌ర్ 10న హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్టు నిర్మాత‌లు తెలిపారు.

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, గ‌ణేష్ నిమజ్జ‌నం సంద‌ర్భంగా అభిమానుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వారు వెల్ల‌డించారు. ట్రైల‌ర్ కూడా ఇదే రోజు విడుద‌ల చేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అన్నారు.
నిజానికి నందమూరి హరికృష్ణ బర్త్డే సందర్బంగా ఆడియో లాంచ్ ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కాని ఎన్టీఆర్ కు ఆరోజు బిగ్ బాస్ కార్యక్రమం ఉండడం వలన.. ఆయన బర్తడే తరువాత రోజైన సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఈ మధ్య ఎన్టీఆర్ ప్రతి ఫంక్షన్ కు నాన్న హరికృష్ణ , అన్నయ్య కళ్యాణ్ రామ్ లే ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు.

కానీ ఈ సినిమాను స్వయంగా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు రాజమౌళిని చీఫ్ గెస్టుగా పిలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డబ్బింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *