జై లవకుశ కలెక్షన్స్… ఎంతంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. కాగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్ లతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో తొలి సారిగా ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించాడు.. అందరిని తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా ‘జై’ పాత్ర విలన్ అయినా తన అద్భుతమైన నటనతో అందరి మనసు గెలిచాడు ఎన్టీఆర్.  ఈ చిత్రంలో జై పాత్రకు అభిమానులు, ప్రేక్షకులు జై కొడుతున్నారు.  సాధారణంగా విలన్ పాత్ర అంటే అందరూ వ్యతిరేకిస్తారు..కానీ జై పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

సెప్టెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అయిన జై లవకుశ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో భారీగా వసూళ్లు చేసుకున్నట్లు చెబుతుంది చిత్ర యూనిట్. అంతే కాదు 120 కోట్ల లో దాదాపుగా  72 కోట్ల షేర్ వచ్చింది దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ వసూల్ చేస్తే బయ్యర్లంతా లాభాల బాటలోకి వెళతారు.

జై లవకుశ ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు :

నైజాం                     – 15 కోట్లు
సీడెడ్                     –  10. 92 కోట్లు
కృష్ణా                      –   4. 25 కోట్లు
గుంటూరు              –  5. 67 కోట్లు
ఈస్ట్                      –   5 .10 కోట్లు
వెస్ట్                      –   3. 40 కోట్లు
ఉత్తరాంధ్ర               –  6. 05 కోట్లు
నెల్లూరు                 –   2. 30 కోట్లు
కర్ణాటక                  –   4. 75 కోట్లు
తమిళనాడు            –  1. 22 కోట్లు
అమెరికా                 –  4. 62 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా    –   5. 25 కోట్లు
మొత్తం షేర్             –    71. 82 కోట్ల

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *