జైలవకుశ రెండో టీజర్: లవకుమార్‌కు ఓ వీక్‌నెస్ ఉంది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘జై లవ కుశ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకెండ్ టీజర్ వచ్చేసింది. ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు విభిన్న పాత్రల్లో మొదట విడుదలైన ‘జై’ టీజర్ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన లవకుమార్ టీజర్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంది. ఈ టీజర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
టీజర్ విషయానికి వస్తే… 
జై ఊరమాస్ అయితే.. లవకుమార్ పక్కా క్లాస్‌ క్యారెక్టర్. లవకుమార్ ఓ ప్రయివేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. తనకు మంచి తన అనే వీక్‌నెస్ ఉందని టీజర్‌లో లవకుమార్ చెబుతాడు. ఆ వీక్‌నెసే తన జీవితాన్ని తలకిందులు చేసిందని బాధపడతాడు. మంచి తనం పుస్తకాల్లో ఉంటే పాఠమవుతుందని, అదే మనలో ఉంటే గుణపాఠమవుతుందని లవకుమార్ ఇచ్చే ఉపదేశంతో టీజర్ ముగుస్తుంది. మంచితనంతో లవకుమార్ జీవితం ఎలా తలకిందులైందో సినిమాలో చూడాల్సిందే!
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో రోనిత్ రాయ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ప్రవీన్, హంస నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *