‘జైలవకుశ’ ట్రైలర్ రిలీజ్‌….రెచ్చిపోయిన యంగ్‌ టైగర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శిస్తున్న ‘జైలవకుశ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మూడు భిన్న పాత్రలు పోషిస్తున్న ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో దుమ్మురేపాడు. ఏ తల్లికైనా ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామలక్షణభరతులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ రామలక్ష్మణులు అయ్యారంటూ ఎన్టీఆర్ తాజా ట్రైలర్‌తో వచ్చేశాడు.

రెండు నిమిషాల 12 సెకన్ల ట్రైలర్‌లో జై,లవ,కుశ పాత్రల్లో ఎన్టీఆర్ నవరసాలను పండిస్తున్నాడు. బాబి దర్శకత్వం‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సెప్టెంబర్ 21న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

దీంతో ట్రైలర్‌ను కూడా ఇదే స్థాయితో తీర్చిదిద్దాడు దర్శకుడు బాబి. ‘ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ అంటున్న ‘రావణుడు’. మొత్తానికి ఈ సినిమాలో మూడు పాత్రల్లోనూ తారక్ రెచ్చిపోయి నటించాడు. మరి ఈ ట్రైలర్‌ పై మీరూ ఓ లుక్కేయండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *