జై లవకుశ.. ఫస్ట్ రివ్యూ

జై లవకుశ.. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా. యువ హీరోల్లో ఇప్పటివరకూ ఎవరూ త్రిపాత్రాభినయం చేయకపోవడం, అందులోనూ ఓ క్యారెక్టర్‌‌‌కు నెగిటివ్ షేడ్ ఉండటంతో ‘జై లవకుశ’కు అమాంతం క్రేజ్ ఏర్పడింది. సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్, సాంగ్స్, స్పెషల్ సాంగ్.. ఇలా అన్నింటికీ నెటిజన్లు, అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సినిమా ట్రైలర్‌కు కోటి 30 లక్షల వివ్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21న విడుదలవబోతున్న ఈ సినిమాకు యూఏఈలో ఉండే సినీ విశ్లేషకుడు, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సినిమా ఎలా ఉంది..? ఫ్యాన్స్‌ను అలరించే అంశాలేంటి..? సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటి..? వంటి అన్ని అంశాల గురించి తేల్చిచెప్పేశారు. 

‘జై లవకుశ’ సినిమా ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుందని తన ఫస్ట్ రివ్యూలో ఉమైర్ సంధు తేల్చేశారు. మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారట. టాలీవుడ్ బెస్ట్ మేల్ ఫర్ఫామెన్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఎన్టీఆర్ అవార్డులు కూడా గెలుచుకుంటారంటున్నారు. దేవీశ్రీ ఇచ్చిన పాటలు, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో ప్లస్‌పాయింట్. సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందంటున్నారు. కేఎస్ రవీంద్ర దర్శకత్వ ప్రతిభ ఏంటో ఈ సినిమాతో అందరికీ స్పష్టం అవుతుందని ఉమైర్ సంధు తేల్చిచెబుతున్నారు.

యాక్షన్ సన్నివేశాలు, ‘జై’ పాత్ర ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తుందంట. పాటల్లో ఎన్టీఆర్ డాన్స్‌ను చూసి ఫ్యాన్స్ మైమరిచి పోతారని చెబుతున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్ థియేటర్లలో ఉర్రూతలూగిస్తుందంటున్నారు. లవ సింప్లిసిటీ, కుశ కామెడీతో ఫస్ట్ హాప్ సరదాగా నడుస్తుందనీ, ఇంటర్వెల్ సీన్ అయితే ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ అని చెప్పొచ్చంటున్నారు. హీరోయిన్ల పాత్రలు కూడా బాగున్నాయంటున్నారు. ఎడిటింగ్ ఇంకా కొంచెం బాగా ఉండాల్సి ఉందనీ, కథనంలో అక్కడక్కడా కొంచె డల్ మూమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఓవరాల్‌గా జై లవకుశ.. పక్కాగా  పైసా వసూల్ చేసే సినిమా అని ఉమైర్ సంధు తేల్చిచెప్పేశారు. మొత్తానికి ఈ సినిమాకు ఉమైర్ సంధు.. 3.5/5 రేటింగ్ ఇచ్చి.. ప్యూర్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా దసరాకు ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టేశారని చెప్పేసి సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త చెప్పేశారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *