బాలకృష్ణ ‘జై సింహ’ ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్ అనగానే ఎలా ఉండాలి.. అభిమానులను తెగ ఉత్సాహపరిచేదిగాను.. సినిమాపై క్రేజ్ ను మరింతగా పెంచేదిగాను ఉండాలి. ఈ విషయం నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో సినిమా తీస్తున్న మేకర్స్ కు పెద్దగా చెప్పాల్సిన పని ఎవరికీ ఉండదు.

ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం జైసింహాకు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఈ చిత్రానికి.. టైటిల్ ను రివీల్ చేయడంతోపాటు.. బాలయ్య లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. జైసింహా గా బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నారనే సంగతి ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోతోంది. డిఫరెంట్ మీసకట్టుతో బాలయ్య అదరగొట్టేస్తున్నారు. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్.. బాలకృష్ణ పాత్ర విషయంలో చాలానే కేర్ తీసుకున్నారనే సంగతి అర్ధమవుతుంది.

రీసెంట్ గా వైజాగ్ బీచ్ రోడ్డులో చిత్రీకరించిన సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి.. బాలయ్య మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వెనకాల కనిపిస్తున్న ఎన్టీఆర్ స్టాట్యూ.. ఈ పోస్టర్ కు అదనపు ఆకర్షణ అవుతుందని అనడంలో సందేహం లేదు. అయితే.. టైటిల్ పక్కనే బాలయ్య మరో గెటప్ ని ఉంచడం విశేషం. ఈ చిత్రంలో బాలయ్య మరో కోణంలో కూడా కనిపిస్తారని చెప్పకనే చెప్పారు మేకర్స్. మొత్తం మీద ఒక్క పోస్టర్ తో చాలానే సంగతులు చెప్పి.. నందమూరి అభిమానులను తెగ ఖుషీ చేసేశారు జై సింహా మేకర్స్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *