తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల్లో కి జనసేనపార్టీ

హైదరాబాద్‌: తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అయితే తమ అభ్యర్థులు పార్టీ పరంగా గ్లాస్‌ గుర్తుతో పోటీచేయడం లేదన్నారు. ఈ మేరకు వివరాలను జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీచేయడం లేదని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసేకార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొంటూ.. ఆసక్తి ఉన్న వారు స్వంతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని సూచించింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దీనికి అనుమతిచ్చారని తెలిపింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *