పవన్ ఫ్యాన్స్ పై యాంకర్ ఝాన్సీ ఫైర్

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిపోవడం మామూలే. ఈ విషయంలో నాగబాబు ఓసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డా.. అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందించినా పవన్ అభిమానుల్లో మార్పు రాలేదు. ఐతే తాజాగా మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధం లేని వేడుకలోనూ పవన్ అభిమానుల గోల శ్రుతి మించింది. విజయవాడలో జరిగిన ‘వంగవీటి’ ఆడియో వేడుకలో చోటు చేసుకున్న చిత్రమిది. ఈ వేడుకకు పవన్ అభిమానులు కూడా హాజరయ్యారు. పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఓ దశలో వేదిక వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు.

యాంకర్ ఝాన్సీ అభిమానులకు ఎన్నిసార్లు విజ్నప్తి చేసినా ఫలితం లేకపోయింది. వేడుకలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంది. ఓ దశలో ఫంక్షన్ కొనసాగించలేని పరిస్థితి కూడా తలెత్తింది. దీంతో ఝాన్సీ సహనం కోల్పోయింది. పవన్ కళ్యాణ్ క్రమశిక్షణకు మారు పేరని.. అలాంటి హీరోకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. సినిమాలంటే విజయవాడ జనాలకు ఎంత పిచ్చో చూపించాలని.. కానీ అది ఈ తరహాలో కాదని ఝాన్సీ అంది. ఇలాంటి నినాదాలతో ఈ వేడుకకు వచ్చి అతిథుల్ని ఇబ్బందులకు గురి చేయడం సరి కాదని ఝాన్సీ పేర్కొంది. ఈ వేడుక కోసం ఎంతో కష్టపడి విజయవాడ వరకు వచ్చిన అతిథులకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమని ఝాన్సీ అభిప్రాయపడింది. అయినప్పటికీ పవన్ అభిమానులు శాంతించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఝాన్సీకి వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *