హీరో తమ్ముడితో జాన్వీ డేటింగ్‌.. ఫొటోలు వైరల్‌!

ప్రియాంక చోప్రా తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’ ప్రీమియర్‌ షో ఊహించినట్టుగానే స్టార్స్‌ సందడితో హల్‌చల్‌ చేసింది. ప్రియాంక జర్మనీలో ఉన్నా.. బాలీవుడ్‌ స్టార్లు చాలామంది ఈ ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. అయితే, అందరి దృష్టిని మాత్రం ఓ యువజంట ఆకర్షించింది. బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖట్టర్‌, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ను వెంట తీసుకొని ఈ షోకు హాజరు కావడం.. అందరినీ ఒకింత విస్మయపరిచింది.

ఇలా వీరు జంటగా కనిపించారో లేదా ఒక్కసారిగా ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీరే ఎందుకింత షో స్పెషల్‌గా నిలిచారంటే.. కారణం లేకపోలేదు. జాన్వీకపూర్‌తో ఇషాన్‌ డేటింగ్‌ చేస్తున్నాడన్న వదంతులు ఆయన సోదరుడు షాహిద్‌ కపూర్‌కు నచ్చలేదట. ఈ విషయంలో ఇషాన్‌కు షాహిద్‌ పలు ఘాటు సూచనలు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరు మళ్లీ కలిసి కనిపించడం మరోసారి రూమర్లకు తావిచ్చింది.

షాహిద్‌ సవతి సోదరుడైన ఇషాన్‌ ప్రఖ్యాత ఇరాన్‌ దర్శకుడు మజిద్‌ మజిద్‌ తెరకెక్కిస్తున్న ’బియాండ్‌ ద క్లౌడ్స్‌’  చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. భారత నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాతో డ్రీమ్‌ డెబ్యూ చేస్తున్నాడు. మరోవైపు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌కు పరిచయం అయ్యేందుకు ఎదురుచూస్తోంది. కరణ్‌ జోహార్‌ ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేస్తాడని జాన్వీ తండ్రి బోనీకపూర్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇషాన్‌-జాన్వీ జోడీ గతంలోనూ కలిసి మీడియాకు కనిపించింది.  వరుణ్‌ ధావన్‌ ’బద్రీనాథ్‌కి దుల్హానియా’సినిమాను కూడా ఈ జోడీ కలిసి చూడటం అప్పట్లో హల్‌చల్‌ చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *