జాన్వీ కపూర్ అందానికి ఫిదా…!

అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ కాకముందు న్యూ లుక్స్‌తో అదరగొట్టేస్తుంది. కొన్ని నెలలుగా బాంద్రాలోని డ్యాన్స్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంది తెలిసిన విషయమే. ఈ స్కూల్‌కు వెళ్లేటపుడు ఆమె ధరిస్తున్న దుస్తులు ట్రెండీ లుక్స్‌తో అద్భుతంగా ఉన్నారు. అచ్చం మన సాంప్రదాయంగా కనిపిస్తూ అద్భుంతా కనిపిస్తున్నారు.

ఇటీవలే డ్యాన్స్ స్కూల్ వద్ద డిఫరెంట్ లుక్స్‌లో కనిపించిన జాన్వీ.. మరోసారి తన అందాలతో యూత్‌ను ఫిదా చేస్తోంది. జాన్వీ డ్యాన్స్ స్కూల్‌లో రిహార్సల్స్ పూర్తి చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న జాన్వీ వైట్ కలర్డ్ కాస్టూమ్స్‌లో కనిపించగా, ఇపుడు బ్లాక్ కుర్తా, వైట్ లెగింగ్స్ డ్రెస్‌తో అందరిచూపులు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది జాన్వీ. ఈ స్టిల్స్ చూసిన వారంతా 1989లో వచ్చిన “చాందిని” మూవీలో శ్రీదేవిని మరిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *