శ్రీదేవి కూతురి సిక్స్‌ ప్యాక్‌ చిట్కాలు.!

ముంబై: దడక్‌ చిత్రంతో సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జిమ్‌లో తెగవర్క్‌ అవుట్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో అభిమానులను అలరించిన జాన్వీ.. ఈ  మూవీ కోసం తెగ కష్టపడుతోంది. హీరోయిన్‌ కాకముందే సోషల్‌ మీడియా వేదికగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా ఫిట్‌నెస్‌ పాఠాలు చెబుతోంది.

తన పర్సనల్‌ ట్రైనర్‌తో జిమ్‌లో సిక్స్‌ప్యాక్‌ ఎలా సాధించాలనే చిట్కాలు చెబుతూ.. వర్కఅవుట్‌లకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక మరాఠీ సూపర్‌ హిట్‌ మూవీ ‘సైరాత్‌’కు హిందీ రిమేక్‌ చిత్రమే దడక్‌. ఈ మూవీని కరణ్‌ జోహర్‌ నిర్మిస్తుండగా.. శశాంక్‌ కైతాన్‌ హీరోగా నటిస్తున్నాడు

https://www.instagram.com/p/Bc2W5VVlWUy/

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *