సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న డ్యాన్స్.. గంటల్లోనే కోటి పైగా వ్యూస్

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్న వీడియోల్లో ‘జిమ్మికి కమ్మల్‌’ ఒకటి. ఓనం పండుగ సందర్భంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ వీడియో విపరీతమైన వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ నుంచి కోటి 18 లక్షలకు పైగా చేరుకుంది… అంటే వాళ్ల డ్యాన్స్ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిపోతుంది. కొచ్చిలో ఉన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ కామర్స్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ పాటలో నటించారు. ఓనం సంప్రదాయ దుస్తులు ధరించి వారు చేసిన డ్యాన్స్‌ యువతకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా ‘సెరిల్‌’ అనే అమ్మాయి డ్యాన్స్‌కి బాగా పేరొచ్చింది. రెండు వారాలకు ముందే ఆమె ఆ కళాశాలలో చేరింది. ఓనం పండుగకి ఏదైనా భిన్నమైన వీడియోను రూపొందించాలని భావించి అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ‘జిమ్మికి కమ్మల్‌’ వీడియోకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో ఈ పాటకు వస్తున్న స్పందన చూసి సెరిల్‌ సహా ఆ పాటలో నటించిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
     ఆ సందర్భంగా సెరిల్‌ మాట్లాడుతూ… ‘ఇంతటి స్పందన అస్సలు ఊహించలేదు. మంచి కథాపాత్రలు లభిస్తే సినిమాల్లో నటించేందుకు కూడా సిద్ధమే. తమిళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇంట్లో ఒప్పుకుంటారా అనేది చెప్పలేను. ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పింది. ఇక తమిళంలో తనకు అజిత్‌ అంటే బాగా ఇష్టమని సెరిల్‌ చెప్పింది. కాగా, సోషల్‌ మీడియాలో ఇప్పుడు షెర్లిన్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఓనంకు ఆమె రూపొందించిన వీడియోను ఇప్పటి వరకు కోటి మందికిపైగా చూశారు. హాలీవుడ్‌లో జిమ్మీ కిమ్మల్‌ అనే నటుడు ఈ వీడియో చూసి ట్వీట్‌ చేయడం విశేషం
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *