రిలయన్స్ జియో ఫైబర్ వచ్చేసింది…

రిలయన్స్‌  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత జియోఫైబర్‌ సర్వీసులను  కమర్షియల్‌గా గురువారం, సెప్టెంబరు​ 5 న ప్రారంభించింది. జియో ఫైబర్‌ కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్‌ నుంచి 1 గిగాబిట్‌ దాకా స్పీడ్‌తో సేవలు అందుతాయి.  బ్రాంజ్‌, సిల్వర్‌,  గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినం, టైటానియం  పేరుతో మొత్తం  6 ప్లాన్లను పరిచయం చేసింది. నెలవారి ప్లాన్ తీసుకున్న వారికి సెట్ టాప్ బాక్స్ ఉచితమని తెలిపారు.

జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి 8,499 మధ్య ఉంటాయి. జియో ఫైబర్ అల్ట్రా-హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (1 జిబిపిఎస్ వరకు), ఉచిత దేశీయ వాయిస్ కాలింగ్, కాన్ఫరెన్సింగ్ , ఇంటర్నేషనల్ కాలింగ్, టివి వీడియో కాలింగ్,  కాన్ఫరెన్సింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఓవర్ టాప్ (ఒటిటి) అనువర్తనాలు వంటి సేవలను అందిస్తుంది. గేమింగ్, హోమ్ నెట్‌వర్కింగ్, పరికర భద్రత, వర్చువల్ రియాలిటీ అనుభవం,  ప్రీమియం కంటెంట్ ప్లాట్‌ ఫాం తమదని రిలయన్స్ జియో తెలిపింది.

jio fibre

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *