బాసరలో జ్ఞాన సరస్వతీ దేవి వేడుకలు

నిర్మల్‌: బాసరలో జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకంతో పండితులు ఉత్సవానికి అంకురార్పణ చేశారు. ఈ క్రమంలో అర్చకులు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో చండీ మహా విద్యా హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఉదయం 11 గంటల నుంచి చండీ మహా విద్యా హోమం, ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి. సాధారణ టికెట్‌తో, రూ. వెయ్యి టికెట్‌తో వేర్వేరు మండపాల్లో పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. నాలుగు మండపాల్లో కొనసాగుతున్న అక్షరాభ్యాసాలు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు, పిల్లలకు అధికారులు పాలు, నీళ్లు పంపిణీ చేస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తుల రాకతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *